ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్టు వారెంట్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం
- కేసు నమోదు అయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాకర్ రావు
- సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని పిటిషన్ వేసిన పోలీసులు
- అరెస్టు వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారు. ఇప్పటికే ఏ ఎయిర్ పోర్ట్ లో దిగినా పట్టుకునేందుకు వీలుగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావును పట్టుకునేందుకు ఇంటర్ పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అందుకు అనుమతించాల్సి ఉంటుంది.