కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు
- మే 24వ తేదీకి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు
- బెయిల్ పిటిషన్‌పై వాదనలకు సమయం కోరిన ఈడీ
- తదుపరి గడువులోగా స్పందన తెలియజేయాలన్న హైకోర్టు జడ్జి
కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. గడువు లోగా ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశించారు.