Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ20 క్రికెట్‌ చ‌రిత్ర‌లో మంగోలియా పేరిట అత్యంత‌ చెత్త రికార్డ్!

Mongolia record second lowest T20I total
Advertisement
  • సాన్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో మంగోలియా, జ‌పాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్
  • 12 ప‌రుగుల‌కే మంగోలియా ఆలౌట్
  • అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో అత్య‌ల్ప స్కోరు న‌మోదు
  • 205 ప‌రుగుల తేడాతో జ‌పాన్ బంప‌ర్ విక్ట‌రీ
Advertisement
టీ20 క్రికెట్‌లో మంగోలియా జ‌ట్టు అత్యంత చెత్త రికార్డును న‌మోదు చేసింది. కేవ‌లం 12 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 8.2 ఓవ‌ర్ల‌లోనే మంగోలియా కుప్ప‌కూలింది. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్య‌ల్ప స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన జ‌పాన్ 217 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో మంగోలియా జ‌ట్టు 12 ప‌రుగుల‌కే చాప‌చుట్టేయ‌డంతో జ‌పాన్ 205 ప‌రుగుల భారీ తేడాతో బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 

సాన్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో మంగోలియా, జ‌పాన్ జ‌ట్ల మ‌ధ్య ఈ మ్యాచ్ జ‌రిగింది. తొలుత జ‌పాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 217 ర‌న్స్‌ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో సబౌరిష్ రవిచంద్రన్ అర్ధ‌శ‌త‌కంతో స్వైర విహారం చేశాడు. 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 69 ప‌రుగులు బాదాడు. కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ (32), ఇబ్రహీం తకాహషి (31) ర‌న్స్‌తో రాణించారు. 

అనంత‌రం 218 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన మంగోలియాకు జపాన్‌ బౌలర్‌ కజుమా కటో స్టాఫోర్డ్ చుక్కలు చూపించాడు. 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో మంగోలియా 8.2 ఓవ‌ర్ల‌లో 12 పరుగుల‌కే కుప్ప‌కూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్‌గా పెవిలియ‌న్ చేర‌డం గ‌మ‌నార్హం. సుమియా చేసిన 4 ప‌రుగులే ఆ జ‌ట్టులో టాప్ స్కోర్‌. కాగా, అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ల్ప స్కోరు 10. గతేడాది ఫిబ్ర‌వ‌రిలో స్పెయిన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జ‌ట్టు 10 ప‌రుగుల‌కే ఆలౌటై చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకుంది.

టీ20 క్రికెట్‌లో అత్య‌ల్ప స్కోర్లు ఇవే
10 – ఐల్ ఆఫ్ మ్యాన్ వర్సెస్‌ స్పెయిన్ (2005)
12 – మంగోలియా వర్సెస్‌ జపాన్ (2024)
21 – టర్కీ వర్సెస్‌ చెక్ రిపబ్లిక్ (2019)
23 – చైనా వర్సెస్‌ కౌలాలంపూర్ (2023)
24 – రువాండా వర్సెస్‌ నైజీరియా (2023)
Advertisement
Advertisement
T20I
Mongolia
Japan
Cricket
Sports News

More Telugu News