రోజాను భరించే శక్తి నగరికి లేదు: సీపీఐ నారాయణ
- రోజా అంతులేని అవినీతికి పాల్పడ్డారన్న నారాయణ
- ఊళ్లకు ఊళ్లు దోచేశారని మండిపాటు
- ఎన్నికల్లో రోజాను సాగనంపాలని పిలుపు
మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాతో నియోజకవర్గాన్ని రోజా పూర్తిగా దోచుకుందని విమర్శించారు. రోజాను ఇకపై ఏమాత్రం భరించే శక్తి నగరి ప్రజలకు లేదని చెప్పారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే గంగమ్మ జాతరలో... ఏ విధంగా అయితే చివరి రోజున గంగమ్మను ఊరి బయట వేస్తామో... అదే విధంగా ఎన్నికల్లో రోజాను ఇంటికి సాగనంపాలని అన్నారు. రోజా మరోసారి గెలిస్తే ఆమెను ఎవరూ భరించలేరని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.