ఎన్నికల వేళ బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. హర్యానాలో రాజకీయ సంక్షోభం
- మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు
- మైనార్టీలో పడిపోయిన నాయబ్ సింగ్ ప్రభుత్వం
- తమ మద్దతు కాంగ్రెస్‌కేనన్న ఎమ్మెల్యేలు
- నాయబ్ సింగ్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్
రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారని, వారిలో బీజేపీ సభ్యులు 40 మంది మాత్రమేనని తెలిపారు. ఇటీవలి వరకు మద్దతిచ్చిన జేజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు తాము కూడా మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఇక ఒక్క నిమిషం కూడా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.