రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: ధర్మపురి అర్వింద్ జోస్యం
- జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్న అర్వింద్
- అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శ
- హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి పాలించే అర్హత లేదన్న ఎంపీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. నరేంద్ర మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని... భారత ముస్లింలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే.. ఏడాదిలో జక్రాన్‌పల్లి ఎయిర్‌ఫోర్టు పూర్తి చేస్తామని తెలిపారు.