Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదుల హతం

Two terrorists killed in gunfight with security forces in JK
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం సమీపంలోకి భద్రతా బలగాలు చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 

కాగా, అనంత్ నాగ్ -రాజౌరి లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మంగళవారం ఎన్ కౌంటర్ జరిగిన కుల్గం జిల్లా అనంత్ నాగ్ - రాజౌరీ నియోజకవర్గం పరిధిలోనిదే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ వేసుకుని ఉన్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Terrorists
Attack
Security Forces

More Telugu News