సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి
- రోహిత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలంటూ వినతి
- కేసు రీఓపెన్ చేసినట్లు వెల్లడించిన సీఎం రేవంత్
- సమగ్ర విచారణ జరిపిస్తామని రోహిత్ తల్లికి హామీ
ఈ విషయంపై రాధిక వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రోహిత్ వేముల ఆత్మహత్య కేసు ఇప్పటికే రీఓపెన్ చేయించామని వివరించారు. రోహిత్ మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చూస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాధిక వేముల కృతజ్ఞతలు తెలిపారు.