‘హరిహర వీరమల్లు’ దర్శకుడిగా క్రిష్ స్థానంలో మరొకరు!
- జ్యోతికృష్ణను దర్శకుడిగా తీసుకున్న నిర్మాతలు
- క్రిష్ పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ్యోతికృష్ణ చేస్తారన్న మేకర్స్
- ఊహించని జాప్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే నేపథ్యంలో రెండు భాగాలుగా తీసుకురానున్నారు. 'స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో పార్ట్ వన్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.