నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు
- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా కవిత
- జ్యుడీషియల్ రిమాండులో వున్న కవిత
- సీబీఐ కేసులో బెయిల్ కావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత
కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, సీబీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో కవిత కీలకమైన వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్‌పై నేడు న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం తిరిస్కరించిన విషయం తెలిసిందే.