నాపై నమ్మకంతో రేవంత్ రెడ్డి నన్ను నిలబెట్టారు... 2 లక్షల మెజార్టీతో గెలుస్తా: దానం నాగేందర్
- అంజన్ కుమార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడతాయన్న నాగేందర్
- బీజేపీ, బీఆర్ఎస్ మోసపూరిత మాటలను నమ్మవద్దని హెచ్చరిక
- అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని వ్యాఖ్య
అనంతరం, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం పాటుపడే కాంగ్రెస్కు మద్దతివ్వాలన్నారు. దానంకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు రావడం ఖాయమన్నారు. అందరూ సైనికుల్లా పని చేసి దానంను గెలిపించాలని పిలుపునిచ్చారు.