నేనేదో జగన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన భార్య, ఏ2 మాట్లాడుతున్నారు: చంద్రబాబు
- ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు
- తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- నోటికి గట్టిగా వాత పెట్టాలని వ్యాఖ్యలు
"మీరు చేసే పనులను మాపై నెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే! ఇక్కడ దెందులూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు పులివెందులో ఉన్నాయి? నువ్వే కారణం... అవునా, కాదా?" అంటూ నిలదీశారు.