Chandrababu: ఇదే మా పూర్తి మేనిఫెస్టో: చంద్రబాబు

Chandrababu shares thoughts on manifesto
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు అందించడం తెలిసిన నేతలు కూటమిలో ఉన్నారని వెల్లడించారు. కమిట్ మెంట్ లేని రాజకీయాల వల్ల ఏపీ నాశనమైందని, అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ప్రజల ఆస్తి ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమగ్రంగా ఆలోచించి రూపొందించిన మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చాం... కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి  చేశారు.
Go Back to Shorts
Chandrababu
Manifesto
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News