ఇండిపెండెంట్లకు జనసేన గుర్తు కేటాయింపు.. ఏపీ హైకోర్టులో పిటిషన్
- జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
- ఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన జనసేన
- అనుబంధ పిటిషన్ వేసిన టీడీపీ
జనసేన పోటీ చేయని స్థానాల్లో కూటమి తరపున టీడీపీ లేదా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయిస్తే... జనసేన మద్దతుదారులు తికమకపడే అవకాశం ఉంది. గ్లాసును జనసేన గుర్తుగా భావించి ఇండిపెండెంట్ అభ్యర్థికి పొరపాటున ఓటు వేసే పరిస్థితి ఉంది. అదే జరిగితే కూటమికి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, జనసేన హైకోర్టును ఆశ్రయించింది.