ఆర్సీబీ బ్యాటర్లకు నెట్స్ లో ‘బుమ్రా’ బౌలింగ్!

  • నెట్టింట వైరల్ గా మారిన ఆర్సీబీ టీం బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో
  • అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను పోలిన నెట్ బౌలర్ ముకేష్ కుమార్
  • ఆశ్చర్యపోతున్న క్రికెట్ లవర్స్.. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్ష
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మిగిలిన మ్యాచ్ లను గెలిచేందుకు ముమ్మర సాధన చేస్తోంది. అయితే నెట్ ప్రాక్టీస్ లో ఆర్సీబీ బ్యాటర్లకు ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ ‘బుమ్రా’ బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్సీబీ నెట్ బౌలర్ ముకేష్ కుమార్ బౌలింగ్ యాక్షన్ అచ్చం జస్ప్రీత్ బుమ్రాను పోలి ఉంది. తక్కువ రన్ అప్ తో బుమ్రాలాగానే అతను కూడా హై ఆర్మ్ యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్నాడు. వారిద్దరి బౌలింగ్ యాక్షన్ ఒకేలా ఉండటం చూసి క్రికెట్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ముకేష్ కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ముకేష్ కుమార్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా కొనసాగాడు.

ఐపీఎల్ 2024లో సగం మ్యాచ్ లు పూర్తవగా ఆర్సీబీ జట్టు వరుస ఓటములతో ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. అయితే గత రెండు మ్యాచ్ లలో జట్టు సాధించిన విజయాలతో ప్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఫాఫ్ డూప్లెసీ నాయకత్వంలో మరింత మెరుగ్గా రాణించేందుకు కసరత్తు చేస్తోంది.

ఆర్సీబీ టాప్ పర్మార్మర్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 500కు పైగా పరుగులు సాధించి మరోసారి రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సెంచరీ హీరో విల్ జాక్స్ తో కలసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.


More Telugu News

IPL 2024 jasprit bumrah royal challengers bengaluru viral video net practice bowling