సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగాడు: కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్

Budda Venkanna take a dig at Kesineni Nani
  • వాడీవేడిగా విజయవాడ రాజకీయాలు
  • కేశినేని నాని... చంద్రబాబును, సుజనాను నానా మాటలు అంటున్నాడన్న బుద్ధా
  • సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం 
విజయవాడ లోక్ సభ స్థానం ఎంపీ అభ్యర్థి కేశినేని నానీపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. కేశినేని నాని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ చంద్రబాబును, సుజనా చౌదరిని నానా మాటలు అంటున్నాడని మండిపడ్డారు. 

చంద్రబాబు, సుజనా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తామంటున్నారని, రోడ్లు వెడల్పు చేసే క్రమంలో పేదలను అక్కడ్నించి పంపించేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ చేస్తామని చంద్రబాబు, సుజనా చౌదరి ఎప్పుడూ  అనలేదని స్పష్టం చేశారు. 

విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తానని మాత్రమే సుజనా చౌదరి అన్నారని బుద్ధా వివరించారు. నియోజకవర్గాన్ని బాగు చేస్తానని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. 

ఒకప్పుడు క్యారేజీలు పట్టుకుని సుజనా చౌదరి వెంట తిరిగిన వ్యక్తి ఇవాళ సుజనా చౌదరినే తిడుతున్నాడని, కారణం ప్యాకేజి అని అన్నారు. ఇతడికి ప్యాకేజి ఇస్తే ఏమైనా చేస్తాడని బుద్ధా వెంకన్న విమర్శించారు.
Go Back to Shorts
Budda Venkanna
Kesineni Nani
Sujana Chowdary
Chandrababu
Vijayawada West
TDP
YSRCP

More Telugu News