పురందేశ్వరి ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం చేస్తా: జయప్రద

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇవాళ తిరుమల విచ్చేశారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన జయప్రదను మీడియా పలకరించింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆహ్వానిస్తే రాష్ట్రంలో ప్రచారం చేస్తానని వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేర్చుతానని జయప్రద అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. 

జయప్రద నాడు ఎన్టీఆర్ ప్రభావంతో టీడీపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అనంతరం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలోకి వెళ్లారు. 2019 నుంచి ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో లోక్ సభ సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు.

Jaya Prada
Daggubati Purandeswari
BJP
Tirumala
Andhra Pradesh

More Telugu News