రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ వైఖరి గురించి మోహన్ భాగవత్ ఏం చెప్పారంటే..!
- ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
- రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వివరణ
- అవసరమైనంత కాలం ఉండాల్సిందేనన్న భాగవత్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు తయారుచేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారంలో పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వీడియోలతో సమాజంలో వివిధ వర్గాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని ఈ సందర్భంగా యువతకు హితవు పలికారు.