గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే కాంగ్రెస్ లక్ష్యం.. సీఎం యోగి తీవ్ర వ్యాఖ్యలు
- ఇండియా కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపణ
- గోమాంసం విషయంలో ముస్లింలకు మినహాయింపునివ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య
- ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కూడా గోమాంసం వినియోగంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గొడ్డు మాంసం తినే హక్కును కల్పించాలని కోరుకుంటోందని అన్నారు. జంతు వధకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే కఠినమైన చట్టాలు ఉన్నాయని, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో గోవధను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. అనంతరం దానిని చట్టంగా మార్చిన విషయం తెలిసిందే.