సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ!
- ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు తెరిచిన బీఆర్‌ఎస్ అధినేత
- @KCRBRSpresident పేరిట కేసీఆర్ ఎక్స్ ఖాతా
- తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్న కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారనే దాని కోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.