రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 లకు.. అమ్మ ఒడి రూ. 17 వేలకు పెంపు.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!
- వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు
- మేనిఫెస్టో విడుదల చేస్తూ ఏపీ సీఎం జగన్ ప్రసంగం
- ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వివరణ
తొమ్మిది ప్రధాన హామీలు..
- పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు
- వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు
- అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని హామీ
- వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
- వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి
- ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో)
- వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు
- వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు
- లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా