బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులు
- నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బార్ కార్యకలాపాలు
- ఈనెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.