ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ పై టీడీపీ అభ్యంతరం
- ఏపీలో నిన్నటితో ముగిసిన నామినేషన్ల పర్వం
- సోమవారం నాడు నామినేషన్ వేసిన మంత్రి బుగ్గన
- మంత్రి బుగ్గన ఆస్తుల వివరాలు పూర్తిగా సమర్పించలేదని టీడీపీ నేతల ఆరోపణ
- ఈ సాయంత్రంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని బుగ్గన న్యాయవాదిని కోరిన ఆర్వో
అయితే, బుగ్గన నామినేషన్ పై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ లో బుగ్గన ఆస్తి వివరాలు పూర్తిగా చూపించలేదని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో, డోన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బుగ్గన నామినేషన్ ను పెండింగ్ లో ఉంచారు. సాయంత్రంలోగా పూర్తి ఆస్తుల వివరాలు సమర్పించాలని బుగ్గన న్యాయవాదిని ఆర్వో కోరారు.