Lok Sabha Polls: 88 ఎంపీ సీట్లు.. 1,202 మంది అభ్యర్థులు.. నేడు లోక్​ సభ రెండో దశ పోలింగ్​.. రాహుల్​ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోనూ నేడే!

  • 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు
  • మధ్యప్రదేశ్ లోని బైతూల్ లో ఓ అభ్యర్థి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా
  • శశిథరూర్, తేజస్వీ సూర్య, హేమమాలిని నియోజక వర్గాలకు కూదా నేడే    
 Lok Sabha Polls 2nd Phase today

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్ 26న శుక్రవారం రోజున జరగనుంది. మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మొత్తంగా 16 లక్షలకుపైగా సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఈసీ మే 7వ తేదీకి వాయిదా వేసింది.

రాహుల్ పోటీ చేస్తున్న చోటా ఇవాళే పోలింగ్..
రెండో దశలో భాగంగా కేరళలోని మొత్తం 20 స్థానాలకు శుక్రవారమే పోలింగ్‌ జరగనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సీటు కూడా ఉండటం గమనార్హం. ఇతర ప్రముఖులను చూస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురంలో పోటీ పడుతున్నారు.

  • కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ స్థానంలో బీజేపీ నేత తేజస్వీ సూర్య, ఉత్తరప్రదేశ్‌ లో సినీ నటి హేమమాలిని, ‘టీవీ రాముడు’ అరుణ్‌ గోవిల్‌ తదితరులు ఈ దశలో పోటీ చేస్తున్నారు.
  • కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భఘేల్‌ కూడా రెండో దశలోనే బరిలో ఉన్నారు.

ఏ రాష్ట్రాలు.. ఎన్ని సీట్లు..
రెండో దశ కింద ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎంపీ సీట్లకు పోటీ జరుగుతోందంటే..
  • కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌ లో 8, మధ్యప్రదేశ్‌ లో 6, అసోం, బీహార్ లలో 5 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ లలో 3 చొప్పున, మణిపూర్‌, త్రిపుర, జమ్మూకశ్మీర్‌ లలో ఒక్కో స్థానంలో పోటీ జరుగుతోంది.
  • మొత్తంగా 88 సీట్లకు గాను 1,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
  • ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు.

More Telugu News