CSK: ధర్మశాలలో పంజాబ్ ను మట్టికరిపించిన సీఎస్కే

  • ధర్మశాలలో మ్యాచ్
  • మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసిన చెన్నై
  • ఛేదనలో 9 వికెట్లకు 139 పరుగులే చేసిన పంజాబ్
CSK beat PBKS by 28 runs in Dharmashala

ధర్మశాలలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్  చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. 

168 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, తుషార్ దేశపాండే 2, సిమ్రన్ జిత్ సింగ్ 2, శార్దూల్ ఠాకూర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27, హర్ ప్రీత్ బ్రార్ 17(నాటౌట్), రాహుల్ చహర్ 16 పరుగులు చేశారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (7), రిలీ రూసో (0), కెప్టెన్ శామ్ కరన్ (7), జితేశ్ శర్మ (0), అశుతోష్ శర్మ (3) విఫలం కావడం పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసింది. 

నేటి రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × లక్నో సూపర్ జెయింట్స్

ఇవాళ ఐపీఎల్ లో డబుల్ హెడర్ కాగా, రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. 

కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. 14 బంతుల్లో 32 పరుగులు చేసిన సాల్ట్... నవీనుల్ హక్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 68 పరుగులు. సునీల్ నరైన్ 30, రఘువంశీ 5 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News