చిరుత దాడి.. మృత్యువు నుంచి తప్పించుకున్న జింబాబ్వే మాజీ క్రికెటర్
- ట్రెక్కింగ్ చేస్తున్న విటల్ పై చిరుత దాడి
- చిరుతపై తిరగబడ్డ విటల్ పెంపుడు శునకం
- రక్తమోడుతున్నా లెక్కచేయక యజమానిని కాపాడిన వైనం
గయ్ విటల్ జింబాబ్వేలో సఫారీ నిర్వహిస్తున్నాడు. హ్యూమని ప్రాంతంలో ఈరోజు ట్రెక్కింగ్ కు వెళ్లాడు. తనతో పాటు తన పెంపుడు శునకాన్ని కూడా తీసుకెళ్లాడు. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అతనిపై ఓ చిరుత దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పెంపుడు శునకం తన యజమానిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో అది కూడా తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్నా లెక్కచేయక... విటల్ ను రక్షించింది. గాయపడ్డ ఇద్దరినీ ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. విటల్ పెంపుడు శునకం కూడా కోలుకుంటోంది.