హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డికి టిక్కెట్
- కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ
- హైదరాబాద్ నుంచి బరిలోకి దిగుతున్న మహమ్మద్ సమీర్
తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఏప్రిల్ 18న ప్రారంభమైన నామినేషన్ దాఖలు ప్రక్రియ 25న ముగుస్తుంది. ఏప్రిల్ 26వ తేదీన స్క్రూటీని ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 17 లోక్ సభ స్థానాల్లో మే 13న ఒకేదఫాలో పోలింగ్ పూర్తవుతుంది.