కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం... కాన్వాయ్‌లోని 10 వాహనాలు ఒకదానికొకటి ఢీ
- నల్గొండ జిల్లాలోని వేములపల్లి శివారులో ఒకదానికొకటి ఢీకొన్న కార్లు
- దెబ్బతిన్న ఎనిమిది నుంచి పది వాహనాలు
- ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న నాయకులు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దాదాపు అన్ని కార్ల బ్యానెట్లు దెబ్బతిన్నాయి. ఓ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.