లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 34 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.72 శాతం లాభపడ్డ జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,852కి పెరిగింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 22,402 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.72%), టాటా స్టీల్ (2.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.75%), కోటక్ బ్యాంక్ (1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.48%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.17%), టీసీఎస్ (-1.11%), మారుతి (-0.72%), ఇన్ఫోసిస్ (-0.68%), రిలయన్స్ (-0.61%).   

Stock Market
Sensex
Nifty

More Telugu News