Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ 8 సీట్లు గెల్చుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి ఛాలెంజ్

  • మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
  • టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని సవాల్
  • తాము 12 ఎంపీ సీట్లను గెలవబోతున్నామంటూ ధీమా
Minister Komatireddy Venkat Reddy Challenge To KCR

లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను గెల్చుకుంటామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. మాజీ సీఎంకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కనుక 8 ఎంపీ సీట్లను గెల్చుకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 మంది తనతో టచ్ లో ఉన్నారని, బీఆర్ఎస్ లోకి వచ్చేస్తామని అంటే తానే వద్దన్నానని కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా కోమటిరెడ్డి స్పందించారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు తాము వెల్లడిస్తామని, కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఆయన చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అర్భకులం కాదు.. అర్జునులమై పోరాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వివరించారు.

More Telugu News