అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీకి జరిమానా
- కోల్ కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఘటన
- ఫుల్ టాస్ బాల్ కు అవుటైన కోహ్లీ
- అది నడుం ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందన్న కోహ్లీ
- నిబంధనల ప్రకారం అది నాటౌట్ అంటూ అంపైర్ తో వాగ్యుద్ధం
- కోహ్లీ నియమావళిని ఉల్లంఘించాడన్న ఐపీఎల్ పాలకమండలి
కోహ్లీ ప్రవర్తనను ఐపీఎల్ పాలకమండలి తీవ్రంగా పరిగణించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవల్-1 తప్పిదానికి పాల్పడినట్టు పాలకమండలి గుర్తించింది. తాను నిబంధనలు అతిక్రమించినట్టు కోహ్లీ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు.