ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!
- పాకిస్థాన్లోని రావల్పిండిలో ఘటన
- జీనత్ వాహీద్ అనే మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలు
- నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అలాగే శిశువుల శరీర బరువు కూడా సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. ఇక సెక్స్టప్లెట్స్ వివిధ రకాలు. ఆరు వేర్వేరు అండాలు, స్పెర్మ్ కలయికల నుండి వచ్చేవి ఒక రకమైనవి కాగా. అలాగే ఒకే ఫలదీకరణ అండం బహుళ పిండాలుగా విడిపోయినప్పుడు వచ్చే సెక్స్టప్లెట్స్ మరో రకానికి చెందినవిగా వైద్య నిపుణులు పేర్కొనడం జరుగుతుంది.