Devineni Uma: గులకరాయి డ్రామా కేసుపై పెట్టిన శ్రద్ధ మిగిలిన వాటిపై ఎందుకు పెట్టలేదు?: దేవినేని ఉమ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేస్తే ఇంతవరకు చర్యలు లేవని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. అంగళ్లులో జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబుపై దాడి చేసి రివర్స్ లో మళ్లీ మాపైనే తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై దాడి చేసి... యువగళం వాలంటీర్లపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. దాడులకు సాక్ష్యాధారాలు ఉన్నా నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. గులకరాయి డ్రామా కేసుపై పెట్టిన శ్రద్ధ మిగిలిన వాటిపై ఎందుకు పెట్టలేదు జగన్? అని ప్రశ్నించారు.  

Devineni Uma
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News