కాలేజీ క్యాంపస్లో యువతిని అతి దారుణంగా పొడిచి చంపేసిన యువకుడు.. షాకింగ్ వీడియో!
- కర్ణాటక హుబ్బళ్లిలో ఘటన
- మృతురాలిని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్గా గుర్తించిన పోలీసులు
- పోలీసుల అదుపులో నిందితుడు ఫయాజ్
- ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం
పోలీసులు ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. బీసీఏ కోర్సు సమయంలో వీరిద్దరూ కలిసి చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తామిద్దరం ప్రేమించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. కానీ, కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఆమె తనను దూరం పెడుతుండటంతోనే హత్య చేశానని ఫయాజ్ అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.