చెలరేగిన సూర్యకుమార్ యాదవ్... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు

Mumbai Indians set 193 runs target to Punjab Kings
ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ముల్లన్ పూర్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. 

'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్ స్పెషాలిటీ ప్రదర్శించాడు. సూర్య 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు సాధించాడు. 

పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కెప్టెన్ శామ్ కరన్ 2, కగిసో రబాడా 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Mumbai Indians
Surya Kumar Yadav
Punjab Kings
Mullanpur

More Telugu News