Lavu Sri Krishna Devarayalu: నామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

Lavu Srikrishnadevarayalu files nomination papers
షార్ట్స్‌లో చూడండి
నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. 

"విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. ప్రతి క్షణం ప్రజల కోసమే, ప్రతి అడుగు పల్నాడు అభివృద్ధి కోసమే. నిరంతరం ప్రజాసేవలో ఉండేలా పల్నాడు ప్రజలందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని వారాల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
Go Back to Shorts
Lavu Sri Krishna Devarayalu
Nomination
Narasaraopet
MP
Lok Sabha Polls
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News