ఎన్టీఆర్ ఫోటో ఉన్న వాహనంపై నామినేషన్ వేసేందుకు వెళ్లిన సుజనా చౌదరి.. కూటమిదే గెలుపని ధీమా
- విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ తరపున సుజనా పోటీ
- సుజనా వెంట వంగవీటి రాధ, బుద్దా, కొనకళ్ల తదితర నేతలు
- వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్న సుజనా
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. విజయవాడ వెస్ట్ లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాన్ని తిరోగమనం పట్టించారని మండిపడ్డారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజల నుంచి తనకు మంచి స్పందన వస్తోందని... అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తాను చేసి చూపుతానని చెప్పారు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడను రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి రాజధానిగా చేసి చూపుతామని అన్నారు.