ప్రియాంక, రాహుల్ గాంధీలను చూసే బదులు కజిరంగా పార్కుకు వెళ్లడం మంచిదని ప్రజలు భావిస్తున్నారు: అసోం సీఎం
- అమూల్ బేబీలను చూసేందుకు ప్రజలు ఎందుకు వెళతారని ఎద్దేవా
- గాంధీ కుటుంబానికి చెందిన నేతలను చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్య
- అందుకే ఇటీవలి ప్రియాంక గాంధీ ర్యాలీలో జనాలు లేరన్న హిమంత బిశ్వ శర్మ
తనకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో కలిసి ప్రియాంక గాంధీ ఇటీవల చేపట్టిన ర్యాలీలో కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే పాల్గొన్నారన్నారు. గాంధీ కుటుంబం నేతలను చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రియాంక గాంధీ రోడ్డు షోలో అసలు జనాలే లేరన్నారు.