బీసీ బిడ్డను ఇరికించే ప్రయత్నం.. జగన్ పై దాడి ఘటనపై అచ్చెన్న ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామాతో ఎస్సీ బిడ్డను ఐదేళ్లపాటు జైలు పాలు చేశారని, ఇప్పుడు గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డ సతీశ్‌ను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గులకరాయి ఘటనకు, టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కోడికత్తి సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలని నాడు అన్నారని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారే దీనికి బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

బోండా ఉమను ఇరికించే యత్నం 
గులకరాయి కేసులో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత కేశినేని చిన్ని ఆరోపించారు. బీసీ యువకుల్ని బెదిరించి ఉమామహేశ్వరరావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో టీడీపీ క్యాడర్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News