జంటనగరాల్లో నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు
- భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర
- ధూల్‌పేట సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర
- రాత్రి 11.30 గంటల వరకు గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- 1000 మంది పోలీసులతో భద్రత
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర నిర్వహించాలని హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భవ్య శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.