సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై స్పందించిన జనసేన నేత నాగబాబు
- సీఎం జగన్పై దాడిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన జనసేన ప్రధాన కార్యదర్శి
- రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు.. కానీ ఇలాంటి భౌతిక దాడులు హేయమని వ్యాఖ్య
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నాగబాబు
కాగా ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో శనివారం రాత్రి దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు 2024లో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా సింగ్ నగర్ వద్ద ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్కు బస్సులోనే చికిత్స అందించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఆయన చేరారు.