సీఎం జగన్‌పై రాళ్లదాడి వెనక టీడీపీ హస్తం: వైసీపీ
- ‘సిద్ధం’ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే పిరికిచర్యకు పాల్పడ్డారని ఆరోపణ
- ఇలాంటి చర్యలతో గెలుపు రాదని గుర్తించాలని హితవు
- దాడిని ఖండించిన విజయసాయి రెడ్డి
సీఎంపై దాడిని వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధికారక రాజకీయాలను నమ్మలేదంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హింస, కుట్రలతో పిరికిపంద రాజకీయాలు చేస్తున్నట్టు ఈ ఘటనతో మరోసారి రుజువైంది’’ అని ఆయన పోస్ట్ పెట్టారు. జగన్ యాత్ర సక్సెస్ కావడం చూసి ఓర్వేలేక ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులతో ఎన్నికల్లో గెలవలేరనేది టీడీపీ గుర్తించాలని అన్నారు. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.