Raja Singh: తొలిసారిగా తెలుగులో పాట రాసి ఆలపించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Goshamahal MLA Rajasingh pens and sings a telugu song for the first time

  • శ్రీరామనవమి పురస్కరించుకుని పాట పాడిన రాజాసింగ్
  • ‘హిందువుగా పుట్టాలి..’ అంటూ సాగిన పాట ప్రోమో నెట్టింట హల్‌చల్
  • ఈ నెల 17న శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా పూర్తి పాట విడుదల

సంచలనాలకు కేరాఫ్‌గా మారిన గోషామహల్ (హైదరాబాద్) బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఆయన తొలిసారిగా తెలుగులో స్వయంగా ఓ పాట రాసి పాడారు. శనివారం ఈ పాట ట్రయల్‌ను విడుదల చేశారు. ‘‘హిందువుగా పుట్టాలి.. హిందువుగా బతకాలి.. హిందువుగా చావాలిరా.. కాషాయ మెత్తాలి ముందడుగు వేయాలి.. పులిగా గర్జించాలిరా తమ్ముడూ’’ అంటూ సాగిన పాట నెట్టింట సందడి చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. 

పూర్తి పాటను ఈ నెల 17న ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం వద్ద విడుదల చేసి శోభయాత్ర ప్రారంభిస్తారు. 13 ఏళ్ల క్రితం నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా రాజా సింగ్ శ్రీరామ నవమి శోభయాత్రకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

Raja Singh
GoshaMahal
Hyderabad
BJP
  • Loading...

More Telugu News