Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిడ్నీ మాల్‌లో క‌త్తిపోట్ల ఘ‌ట‌న క‌ల‌క‌లం.. న‌లుగురి మృతి!

Four killed in stabbing spree at Sydney mall
Advertisement
  • సిడ్నీలోని బోండీ జంక్ష‌న్ ప‌రిధిలోని వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఘ‌ట‌న
  • నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
  • షాపింగ్ మాల్‌లోని వంద‌ల సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా ప‌రుగు తీయ‌డంతో భ‌యాన‌క ప‌రిస్థితులు
Advertisement
ఆస్ట్రేలియా రాజ‌ధాని సిడ్నీలోని ఓ షాపింగ్ మాల్‌లో క‌త్తిపోట్ల‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందిన‌ట్లు, ప‌లువురు గాయ‌పడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్ష‌న్ ప‌రిధిలో గ‌ల‌ వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు చ‌నిపోయిన‌ట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. 

అలాగే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితుడిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' స్ప‌ష్టం చేసింది. కాగా, ఈ ఘ‌ట‌న‌తో షాపింగ్ మాల్‌లో ఉన్న‌ వంద‌ల సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా ప‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. దాంతో ప‌రిస్థితి భ‌యాన‌కంగా మార‌డంతో మాల్‌కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల‌ను పోలీసులు అక్క‌డి నుంచి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిని అంబులెన్సులలో స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారు.
Advertisement
Advertisement
Sydney mall
Stabbing
Australia
Crime News

More Telugu News