JithenderReddy: ‘జితేందర్‌రెడ్డి’ నుంచి ‘అఆఇఈ’ సాంగ్.. మాస్‌బీట్‌లో కిక్కెక్కిస్తున్న పాట

A Aa E Ee U Uu song out from jehtender Reddy movie
షార్ట్స్‌లో చూడండి
ఉయ్యాల జంపాల,  మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘జితేందర్‌రెడ్డి’. 1980లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. 

ముదుగంటి క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘అఆఈఈఉఊ’ లిరికల్ సాంగ్ విడుదలైంది.  కాలేజీలో ఆర్ట్స్, సైన్స్, ఇంగిలీషు.. అంటూ మాస్‌బీట్‌లో సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘ఐన్‌స్టీన్, న్యూటన్‌లే కాదు. మనకు ఎందరో ఉన్నారు హిస్టరీ తిప్పావంటే’ అంటూ ఆలోచించేలా సాగింది. మే 3న సినిమా విడుదల కానుంది. 

Go Back to Shorts
JithenderReddy
Rakesh Varre
RavinderReddy
Muduganti
A..Aa..E..Ee..U..Uu Song

More Telugu News