Ayush Badoni: ఆదుకున్న ఆయుష్ బదోనీ... ఫర్వాలేదనిపించిన లక్నో సూపర్ జెయింట్స్

  • ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు
  • 35 బంతుల్లో 55 పరుగులు చేసిన బదోనీ
Ayush Badoni drives LSG reasonable score against Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టును యంగ్ బ్యాట్స్ మన్ ఆయుష్ బదోనీ ఆదుకున్నాడు. బదోనీ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

బదోనీ చలవతో లక్నో జట్టు ఫర్వాలేదనిపించే స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. మరో ఎండ్ లో అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 20 పరుగులు జోడించాడు. 

అంతకుముందు, లక్నో ఇన్నింగ్స్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ 19, కెప్టెన్ కేఎల్ రాహుల్ 39, దేవదత్ పడిక్కల్ 3, మార్కస్ స్టొయినిస్ 8, దీపక్ హుడా 10, కృనాల్ పాండ్యా 3 పరుగులు చేశారు. నికోలాస్ పూరన్ (0) డకౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ యశ్ ఠాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

More Telugu News