కర్ణాటకలో పవన్ కల్యాణ్ ప్రచారం... ఇది అవాస్తవం: జనసేన పార్టీ

జనసేనాని పవన్ కల్యాణ్ కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన పార్టీ స్పందించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో బీజేపీ తరఫున ఈ నెల 17న పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వెల్లడించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ వివరించింది. ఈ పర్యటన ఇప్పటికే ఖరారయ్యిందని పేర్కొంది.

Pawan Kalyan
Karnataka
Election Campaign
Janasena
BJP
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News