Vellampalli Srinivasa Rao: సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు... ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని... ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న హెచ్చరికలకు జగన్ భయపడరని వెల్లంపల్లి అన్నారు. ఆరోజుల్లోనే కేంద్రంలో ఉన్న సోనియాగాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్ అని... పవన్ వంటి పిల్ల రాజకీయ నాయకుల వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవడం అనవసరమని చెప్పారు. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత మాట్లాడాలని ఎద్దేవా చేశారు. సినిమా యాక్టర్ల గురించి ఎవరూ భయపడరని అన్నారు. జగన్ బస్సు యాత్రకు విజయవాడ నగర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Sonia Gandhi
Congress

More Telugu News