హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
- ఈ నెల 18న ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం
- ఈ నెల 19న నామినేషన్ వేయాలని బాలకృష్ణ నిర్ణయం
ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు.
కాగా, ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే.