Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురు సితార‌తో మ‌హేశ్ క్యూట్ ఫొటో.. నెట్టింట వైర‌ల్!

Super Star Mahesh Babu New Photo with Daughter Sitara goes Viral on Social Media
Advertisement
  • యూరప్ ట్రిప్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ్యామిలీ
  • ఈ ట్రిప్ తాలూకు ఫొటోల‌ను ఎప్పటికప్పుడు అభిమానుల‌తో పంచుకుంటున్న ప్రిన్స్‌
  • తాజాగా సోష‌ల్ మీడియాలో కూతురు సితార‌తో మ‌హేశ్ క్యూట్ ఫొటో వైర‌ల్‌
  • తాజా ఫొటోలో ఫ్రెష్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్న మ‌హేశ్‌ 
Advertisement
సినిమాల నుంచి విరామం దొరికితే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న ఫ్యామిలీతో గ‌డ‌ప‌డానికే అధిక ప్రాధాన్య‌త‌ ఇస్తార‌నే విష‌యం తెలిసిందే. అందుకే షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికిన‌ కుటుంబంతో కలిసి విదేశాలకు హాలీడే ట్రిప్‌ల‌కు వెళ్తుంటారు. ఇక 15 రోజుల క్రితం ప్రిన్స్ త‌న‌ భార్య, పిల్లలతో కలిసి యూరప్ వెళ్లారు. ప్రస్తుతం మ‌హేశ్ ఫ్యామిలీ యూరప్‌లోనే ఉంది. 

అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ తాలూకు ఫొటోల‌ను సూప‌ర్ స్టార్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో త‌న అభిమానుల‌తో పంచుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా యూరప్ టూర్‌లో కూతురు సితారతో కలిసి మహేశ్‌ దిగిన ఫొటో ఒక‌టి ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

ఫొటోలో కూతురు సితార‌ను ప్రేమగా హత్తుకొని ఉండ‌డం మ‌నం చూడొచ్చు. అలాగే ఈ ఫోటోలో మహేశ్ చాలా ఫ్రెష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పొడవాటి జుట్టుతో సరికొత్త లుక్‌లో ప్రిన్స్‌ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఫొటోపై సూప‌ర్ స్టార్ అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మ‌హేశ్ త‌న అభిమానుల‌ను అల‌రించాడు. ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించే త‌న త‌ర్వాతి మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ అడ్వెంచ‌ర్ డ్రామాగా ఉండబోతుంద‌ని ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. 

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది, ఎప్పుడు మూవీ తాలూకు అప్‌డేట్స్ వ‌స్తాయ‌ని ప్రిన్స్ అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement
Mahesh Babu
Sitara
Social Media
Instagram

More Telugu News